ఈ కృష్ణా పుష్కరాలు చరిత్రలో నిలిచిపోవాలి

తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి వచ్చిన కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శా ఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రె డ్డి అన్నారు. మంగళవారం రంగాపూర్ వీఐపీ పుష్కరఘాట్‌ను వై ద్యారోగ్య శాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మిశివకుమార్‌లతో కలిసి సందర్శించారు. పుష్కరఘాట్ పనులు, చే రిన కృష్ణా వరదనీరును చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పుష్కరఘాట్‌లో కృష్ణానదికి జలతర్పణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ మాట్లాడుతూ పుష్కరాలను విజయవంతం చేయడమే ప్రభు త్వ లక్ష్యమని, ఇందుకు ప్రకృతి కూడా సహకరిస్తుందన్నారు. అనుకున్న స్థాయిలో పనులు పూర్తికావడం ప ట్ల సంతోషంగా ఉందని, అనుక్షణం నిరంజన్ రెడ్డి కృషి స్పష్టంగా కనిపిస్తుందని కొనియాడారు.

జిల్లాలోనే సర్వహంగులు ఉన్న రంగాపూర్ ఘాట్ అత్యధిక భ క్తులు స్నానాలు ఆచరించే ఘాట్ కానుందన్నారు. ప్ర భుత్వం మందస్తు ప్రణాళిక ప్రకారం నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నదీతీర ఘాట్‌లు, రహదారులు, సౌకర్యాలు మెరుగు పర్చేందుకు రూ.830 కోట్లు కేటాయించిందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నా యకులు గౌని బుచ్చారెడ్డి, కోదండరాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%9A%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8B%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF-20-596326.aspx