కృష్ణాపుష్కరాలకు అలంపూర్ బయలుదేరిన సీఎం కేసీఆర్

pushkaraluuకృష్ణా పుష్కరాల కోసం సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆలంపూర్ బయలుదేరి వెళ్లారు. ఇవాళ ఆయన తన నివాసం నుంచి మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్‌కు బయలుదేరారు. రేపు ఉదయాన్నే ఆయన కృష్ణా నదిలో పుణ్యస్నానం ఆచరించి పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా నదికి తొలిసారిగా పుష్కరాలు వస్తున్న విషయం తెలిసిందే. రేపటి నుంచి ఈనెల 23 వరకు పుష్కరాలు కొనసాగనున్నాయి. సుమారు 3 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలను ఆచరిస్తారని అధికారులు అంఛనా వేస్తున్నారు.