కృష్ణమ్మకు.. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవి నదీహారతి

వారణాసిలో గంగానదీ హారతి చూడటమే తప్ప రంగాపూర్ పుష్కర ఘాట్ నదీ హారతి ఇవ్వటంలో భాగమవ్వ టం తన యొక్క అదృష్టంగా భావిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టికే శ్రీదేవి తన మనసులో భావాన్ని వెలిబుచ్చారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా ఆదివారం జిల్లా కలెక్టర్ మునగమాన్ దిన్నె పుష్కర ఘాట్ వద్ద ప్రభు త్వం ప్రచురించిన కృష్ణవేణి పుష్కర గ్రంథాన్ని ఆవిష్కరించారు. అనంత రం రంగాపూర్ అభయాంజనేయ ఆలయ శోభాయాత్రలో ఆమెతో పాటు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆయన సతీమణి పాల్గొన్నారు. నది తీరంలో ఆలయ ట్రస్టు చైర్మన్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నదిహారతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొని హారతినిచ్చారు. వేద బ్రాహ్మణులను సన్మానించి అభినందించారు.

మీడియాతో మాట్లాడు తూ రంగాపూర్ ఘాట్ నేర్పాట్లపై ఆమె సంతృప్తి వ్యక్తం చేస్తూ, పుష్కర భక్తులకు పాలమూరు ప్రజలు, అధికారులు అత్యద్భుత ఆతిద్యాన్ని ఇచ్చారని ప్రపంచానికి తెలిసేలా మన సేవలు అందిద్దామన్నారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా బాధ్యతగా వ్యవరించాలని ఆమె కోరా రు. కార్యక్రమంలో ఏజేసీ బాలజీ రంజిత్ ప్రసా ద్, ఆర్డీ రాంచంద్రానాయక్, డీఎస్పీ జోగుల చెన్నయ్య, సీఐ కిషన్, మార్కెట్ యార్డు చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, బండ్ల చంద్రశేఖర్‌రెడ్డి భక్తులు పాల్గొన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B0%B2%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%A8%E0%B0%A6%E0%B1%80%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF-20-597637.aspx