కృష్ణవేణి.. పుష్కర కోటి

-ఏడో రోజు 17.5 లక్షల మంది.. మొత్తం 1.06 కోట్ల మంది పుణ్యస్నానాలు
-అలంపూర్‌లో శతచండీయాగం
-ఘాట్లను పర్యవేక్షించిన మంత్రులు
-అలంపూర్‌లో శతచండీయాగంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
-ఘాట్లను పర్యవేక్షించిన మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డిkrishna-pushkaralu
పుష్కరవేణి కృష్ణవేణి పులకించింది. ఏడో రోజైన గురువారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో కలిపి 17 లక్షల 50 వేల మంది పుణ్యస్నానాలు ఆచరించగా, ఇప్పటివరకు కోటీ 60 వేల మంది భక్తులు పవిత్రస్నానాలు చేశారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా పుష్కర స్నానమాచరించారు. మమబూబ్‌నగర్ జిల్లాలో పుష్కరాలకు గురువారం 14.5 లక్షల మంది వచ్చినట్లు సమాచారం. krishna-pushkaralu1
రాఖీ పౌర్ణమి సందర్భంగా సెలవు ఉండటంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. అలంపూర్ జోగుళాంబ ఆలయంలో కర్ణాటక శృంగేరీ మఠం నుంచి వచ్చిన 12 మంది రుత్విక్కుల సమక్షంలో నిర్వహించిన శత చండీయాగంలో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు. దాదాపు 40 మంది రుత్విక్కులతో ఆధ్వర్యంలో పుష్కరాలు పూర్తయ్యేవరకు యాగం కొనసాగుతుందని, 24న పూర్ణాహుతితో పరిసమాప్తమవుతుందని అధికారులు తెలిపారు.krishna-pushkaralu2
రంగాపూర్‌ఘాట్‌లో ఏర్పాట్లపై అధికారులు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచనలు చేశారు. పస్పుల సమీపంలోని శ్రీపాద చాయ ఆశ్రమంలో శ్రావణ పౌర్ణమి, పుష్కరాల సందర్భంగా నిర్వహించిన యాగంలో మంత్రి లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లకు భక్తుల తాకిడి పెరుగుతుండటంతో భద్రతాఏర్పాట్లను హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్ పరిశీలించారు. నల్లగొండ జిల్లావ్యాప్తంగా మూడు లక్షల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. దామరచర్ల మండలం అడవిదేవులపల్లిలో మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబ సమేతంగా, వాడపల్లి శివాలయం ఘాట్‌లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు పుష్కర స్నానం చేశారు. ఇంటెలిజెన్స్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, మట్టపల్లిలోని వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానాలు ఆచరించారు.

Source:http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/17-5-lakh-devotees-pushkara-bath-on-th-day-in-krishna-pushkaralu-1-2-520492.html