కృష్ణాతీరంలో పుష్కర శోభ

కృష్ణానదికి పుష్కర శోభ సంతరించుకుంది. కృష్ణానది తీరంలోని ఆలయాలు శోభాయమానంగా తీర్చిదిద్దారు. పుష్కర స్నానాల కోసం భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్కర ఘాట్ల వద్ద భక్తజనం పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కృష్ణాపుష్కరాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారీ పోలీసు బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రాతా ఏర్పాటు చేశారు. పుష్కరాల కోసం వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ 1149 బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు మిర్యాలగూడ నుంచి వాడపల్లికి చేరుకోవచ్చు. మిర్యాలగూడ నుంచి వాడపల్లి పుష్కరఘాట్లకు బస్సు సౌకర్యం కల్పించారు. విలువైన సామాగ్రీ, బరువు వస్తువులు తీసుకురావద్దని పోలీసులు సూచించారు. వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, నల్లగొండ నుంచి వచ్చే భక్తుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేశారు. దామరచర్ల, బొత్తలపాలెం వద్ద రెండు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. బొత్తలపాలెం వరకు మాత్రమే ప్రైవేటు వాహనాలను అనుమతి ఇస్తారు. బొత్తలపాలెం నుంచి 60 బస్సుల్లో యాత్రికులను పుష్కరఘాట్లకు తరలిస్తారు. పుష్కరఘాట్లలో రద్దీ ఉంటే వేచి ఉండేందుకు హోల్డింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు.

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/krishna-pushkaralu-telangana-state-1-1-500899.html