కృష్ణానదీ తీరాన గంగా హారతి

గద్వాల మండలం నదీ అగ్రహారంలోని కృష్ణానదీ తీరాన కృష్ణాపుష్కరాల సందర్భంగా ఆదివారం రాత్రి పురోహితులు గంగా హారతి నిర్వహించారు. మంత్రోశ్చరణలతో నిర్వహించిన ఈ గంగాహారతి కార్యక్రమానికి దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు, అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, గద్వాల మండల పరిషత్ అధ్యక్షుడు ఎంఏ సుభాన్, భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE%E0%B0%A8%E0%B0%A6%E0%B1%80-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8-%E0%B0%97%E0%B0%82%E0%B0%97%E0%B0%BE-%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF-20-597643.aspx