కృష్ణా తీరంలో.. జనకళ!

-పుణ్యస్నానమాచరించిన11 లక్షల మంది..
-ఆరో రోజు భారీగా భక్తులు..
-అలంపూర్, సోమశిలలో సీఎం కేసీఆర్ వియ్యంకులు హరినాథరావు, కిషన్‌రావు పుష్కరస్నానం..
-నదీఅగ్రహారంలో సినీ నిర్మాతలు బెల్లంకొండ, వెంకట్రాంరెడ్డి..
-రంగాపూర్‌లో నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ..
-ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి..
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి :కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతున్నాయి. జిల్లాలోని ప్రధానఘాట్లన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా 11లక్షల 60వేల మంది భక్తులు పుణ్యస్నాన మాచరించినట్లు అంచనా. అలంపూర్ గొందిమళ్ల ఘాట్‌లో మంత్రి కేటీఆర్ బంధువులు, మంత్రి మామ హరినాథరావు ఆధ్వర్యంలో స్నానమాచరించి జోగుళాంబను దర్శించుకున్నారు. సోమశిల ఘాట్‌లో సీఎం కేసీఆర్ వియ్యంకుడు కిషన్‌రావు (ఎంపీ కవిత మామ)నదిలో స్నానమాచరించారు. రంగాపూర్ ఘాట్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాతృమూర్తి తారకమ్మ (102) పుష్కరస్నానమాచరించారు.

గద్వాల నదీఅగ్రహారంలో సినీ నిర్మాతలు బెల్లంకొండ సురేష్, వెంకట్రాంరెడ్డిలు పుష్కర స్నానం చేశారు. సోమశిలలో ఏర్పాట్లపై మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యవేక్షించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి రంగాపూర్ ఘాట్‌లో, పస్పుల ఘాట్‌లో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు పర్యవేక్షించారు. అలంపూర్‌లో కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరిలు పుష్కర నిర్వహణను పరిశీలించారు. పుష్కరఘాట్లలో భక్తుల కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఉత్తేజపరుస్తున్నాయి.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%A4%E0%B1%80%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9C%E0%B0%A8%E0%B0%95%E0%B0%B3-20-598328.aspx