కృష్ణా పుష్కరాలకు తీరనున్న నీటి కొరత

srisailamdam04హైదరాబాద్: ఫుష్కర స్నానాలు కష్టమే.. పుష్కర జల్లులే(షవర్ల కింద స్నానం) దిక్కు అనుకుంటున్న ఊహాగానాలకు ఇక తెరపడనుంది. ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీరు దిగువకు విడుదలైతుంది. రేపు సాయంత్రానికి వరద నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. ప్రాజెక్టుల వారిగా దిగువకు విడుదలౌతున్న వరద నీటి ప్రవాహం ఈ విధంగా ఉంది. ఆల్మట్టి నుంచి 2.18 లక్షల క్యూసెక్కులు, నారాయణపూర్ నుంచి 2.32 లక్షల క్యూసెక్కుల నీరు, జూరాల నుంచి 60 వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. రేపు సాయంత్రానికి 2 లక్షల క్యూసెక్కులకుపైగా నీరు శ్రీశైలం జలాశయంలోకి చేరనుంది. అటునుంచి నాగార్జునసాగర్ కు పరుగులు తీయనుంది. కృష్ణవేణి వరవళ్లు దిగువకు కొనసాగుతుండటంతో పుష్కరాలకు నీటి కొరత తీరనుంది.

Source:http://www.namasthetelangaana.com/telangana-news/flood-water-comes-to-srishailam-project-1-1-499842.html