కృష్ణా పుష్కరాలకు పోటెత్తిన జనం

కృష్ణా పుష్కరాలు నేటితో పదో రోజుకు చేరుకున్నాయి. కృష్ణమ్మ ఒడిలో పుణ్యస్నానమాచరించి పునీతులయ్యేందుకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ఇవాళ సెలవు దినం కావడంతో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కర ఘాట్లలో భక్తులు పోటెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల వైపు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. సోమశిల, అమరగిరి, జటప్రోలు, మంచాలకట్ట, మల్లేశ్వరం, చెల్లెపాడు ఘాట్లకు భక్తులు తరలి వస్తున్నారు. గొందిమళ్ల, బీచుపల్లిలో పుష్కరఘాట్లు భక్తులతో కిక్కిరిపోయాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి పుష్కరఘాట్లలో వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలాచరిస్తున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/telangana-news/tenth-day-krishna-pushkaralu-1-1-502086.html