ఘనంగా ఏడోరోజు కృష్ణా పుష్కరాలు

pushkaralu కృష్ణా నది తీరంలోని పుష్కరఘాట్లు పుష్కర శోభను సంతరించుకున్నాయి. భక్త జన సందోహంతో విరాజిల్లుతున్నాయి. ఇవాళ ఏడోరోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పలు పుష్కరఘాట్ల వద్ద వేలాదిగా భక్తులు పుష్కర పుణ్య స్నానాలు చేస్తూ పునీతులవున్నారు. రాష్ట్రంలోని బీచుపల్లి, గొందిమళ్ల, వాడపల్లి, నాగార్జునసాగర్ పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్నానాల అనంతరం సమీపంలోని దేవాలయాల్లో దేవతామూర్తులను దర్శించుకుంటున్నారు. ఇవాళ శ్రావణ పౌర్ణమి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నది స్నానం చేసేందుకు తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Source:http://www.namasthetelangaana.com/telangana-news/seventh-day-krishna-pushkaralu-1-1-501720.html