ఘాట్ల వద్ద కృష్ణమ్మ గలగలలు

నాగార్జునాసాగర్ నుంచి దిగువకృష్ణాకు నీరు వదలడంతో మండలంలోని ఏర్పాటు చేసిన 11పుష్కరఘాట్లతో పాటుగా పాత ఐదు పుష్కరఘాట్లుకు నీరు చేరింది. నిన్నటి వరకు ఎండిపోయిన కృష్ణానదికి నీరు వదలడంతో రెండు రోజులుగా నీటి ప్రవాహం పెరుగుతూ వచ్చింది. మండంలోని అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, ఇర్కిగూడెం, వాడపల్లి వద్ద ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లకు పూర్తిస్థాయిలో నీరు వచ్చిచేరింది. మొదటి బెడ్ పూర్తిగా మునిగిపోయింది. నిన్నటి వరకు నీరు చేరుకోని వాడపల్లిలోని లక్ష్మీనర్సిహ్మాస్వామి ఘాట్‌కు బుధవారం నీరు చేరుకుంది. పుష్కరఘాట్లకు నీరు చేరుకోవడంతో ఆయా గ్రామాల ప్రజలు, మహిళలు నీటిలో ఆడుతూ కనిపించారు. అడవిదేవులపల్లి, ముదిమాణిక్యం, ఇర్కిగూడెం ఘాటుతో పాటుగా వాడపల్లిలోని ముదిరాజ్‌రేవు, అయ్యప్ప, లక్ష్మీపురం, వీఐపీ, పాతపోలీస్‌స్టేషన్ ఘాట్లు మొదటి బెడ్‌పూర్తిగా మునిగిపోయాయి. మెస్‌లు కనిపంచడం లేదు. పైబెడ్‌కు నీరు చేరడంతో పుష్కరఘాట్లు నీటితో కళకళలాడుతున్నాయి. తొలిరోజు 7వేల క్యూసెక్కుల నీరు దిగువకు వదలడంతో నీరు మొదటి బెడ్‌కు చేరుకుంది. రెండో రోజు పదివేలకు పెంచడంతో నీటి ప్రవాహం మరింతగా పెరిగింది.
Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%B5%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%97%E0%B0%B2%E0%B0%97%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81-22-596494.aspx