జనకెరటం

-జోగుళాంబ ఘాట్‌లో కమాండెంట్ విజయ్‌కుమార్,ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి
-రంగాపూర్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్,ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి
-బీచుపల్లిలో ఎంపీ గరికపాటి, ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి,పొన్నాల లక్ష్మయ్య, సినీరచయిత గోపీమోహన్
-11 రోజు 21 లక్షల మంది స్నానాలు
మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: పాలమూరులో పుష్కరాలు జోరు తగ్గని రీతిలో కొనసాగుతున్నాయి.కేవలం పుష్కరాలకు ఒకే రోజు గడువు ఉండటంతో ప్రధానఘాట్లలో భక్తుల సంఖ్య భారీగానే కొనసాగింది. బీచుపల్లిలో మరికొన్ని శవర్స్‌ను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. అలంపూర్ మండలం మారమునగాల ఘాట్‌లో రాష్ట్ర భారీ నీటిపారుదళ శాఖ మంత్రి హరీశ్ రావు తల్లితండ్రులు సత్యనారాయణరావు, లక్ష్మిదేవిలు నదీస్నానమాచరించి జోగుళాంబ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. జోగుళాంబ ఘాట్‌లో 2బెటాలియన్ కమాండెంట్ విజయ్‌కుమార్ దంపతులు, మెదక్ జిల్లా చిలుకూరు ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ డీజీపీ దినేష్‌రెడ్డి దంపతులు పుష్కరస్నానం చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన శత చండీయాగంలో అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ పాల్గొన్నారు.

బీచుపల్లిలో రాజ్యసభ సభ్యుడు గరికపాటి రామోహన్‌రావ్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ రవీందర్‌రావు, సినీ రచయిత గోపిమోహన్‌లు స్నానమాచరించారు. మూలమళ్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుష్కరస్నానమాచరించారు. పుష్కరఘాట్లలో భక్తుల సౌకర్యాలపై మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డిలు బీచుపల్లి, రంగాపూర్, చెల్లెపాడు, పెద్దమరూర్, సోమశిల ఘాట్లను పరిశీలించారు. డీఐజీ అకున్ సబర్వాల్, జిల్లా ఎస్పీ రెమారాజేశ్వరి బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లను పర్యవేక్షించారు. సోమవారం 11 వ రోజు జిల్లా వ్యాప్తంగా 21 లక్షల మంది భక్తులు నదీస్నానమాచరించారు. ఇదిలా ఉంటే, పుష్కరాలకు చివరి రోజు మంగళవారం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కల్గకుండా అధికారలు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%9C%E0%B0%A8%E0%B0%95%E0%B1%86%E0%B0%B0%E0%B0%9F%E0%B0%82-20-599522.aspx