జన తరంగిణి.. కృష్ణవేణీ తీరం

కృష్ణవేణికి పుష్కర సౌరభం సంతరించుకుంది. గళగళాపారుతూ బిరబిరా పరుగెడుతూ వస్తోన్న కృష్ణమ్మ ఒడిలోభక్తులు పుణ్యస్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. ఇవాళ ఐదో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కృష్ణా నది తీరంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కరఘాట్‌లలో వేలాదిగా భక్తులు పుష్కర పుణ్యస్నానాలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. కాగా, ఇవాళ కృష్ణా పుష్కరాల ఏర్పాట్లను మంత్రి జూపల్లి పరిశీలించారు. అమరగిరి నుంచి సోమశిల వరకు ఆయన మర పడవలో ప్రయాణించారు. కృష్ణా నది తీరంలోని ప్రకృతి అందాలు కశ్మీర్ అందాలను తలదన్నేలా ఉన్నాయని జూపల్లి వ్యాఖ్యానించారు.

Source:http://www.namasthetelangaana.com/telangana-news/fifth-day-krishna-pushkaralu-1-1-501414.html