జోగులాంబ ఆలయం విశిష్టమైనది: గవర్నర్

governorPushkarఅష్టాదశా శక్తి పీఠాల్లోని ఐదో శక్తిపీఠం ఆలంపూర్‌లోని జోగులాంబ అమ్మవారి ఆలయ ప్రశస్తిని గవర్నర్ నరసింహన్ కొనియాడారు. ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం చాలా విశిష్టమైనదని పేర్కొన్నారు. అమ్మవారి ఆలయం అభివృద్ధి విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకొస్తానన్నారు. రెండు తెలుగు రాష్ర్టాలు కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని కొనియాడారు. కాగా, ఇవాళ ఉదయం ఆయన ఆలంపూర్ సమీపంలోని గొందిమళ్ల పుష్కరాఘట్‌లో గవర్నర్ దంపతులు పుష్కర స్నానం చేశారు. అనంతరం జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/telangana-news/jogulamba-temple-is-great-governor-1-1-501994.html