జోగుళాంబ సన్నిధిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

అలంపూర్ : కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి దంపతులు 5వ శక్తిపీఠాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ సిబ్బంది శేషవస్ర్తాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.