దత్తక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి
మక్తల్, నమస్తే తెలంగాణ : పవిత్ర కృష్ణమ్మ ఒడి లో దత్తాత్రేయుడు కొలువుదీరి ఉన్న కురుమపురంలోని దత్తక్షేత్రాన్ని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సి.లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మక్తల్ మండలంలోని పస్పుల ఘాట్‌ను శుక్రవారం పరిశీలించిన ఆయన మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహ న్‌రెడ్డితో కలిసి పంచదేవ్‌పహాడ్‌లోని శ్రీపాద చాయ ఆశ్రమంలో శు క్రవారం రాత్రికి బ సచేశారు. శనివా రం ఉదయం ఆ యన పస్పుల ఘా ట్‌ను సందర్శించి అక్కడి నుంచి కృ ష్ణానది రెండుపాయల మధ్య గల దత్తక్షేత్రానికి ఎన్‌డీఆర్‌ఎఫ్ వారి ప్ర త్యేకబోటులో చేరుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భం గా ఆలయ అర్చకులు మంత్రితో పాటు ఎమ్మె ల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, ఐఏఎస్ అధికారిణి ప మేలా సత్పతిలకు సాదరంగా స్వాగతం పలికి ప్రత్యే క దర్శనం కలిపించారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ కృష్ణానది రెండుపాయల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన దత్తక్షేత్రం మహిమాన్వితమైనదని, ప్రాచీనచరిత్రలోనూ దత్తక్షేత్రం ప్రస్తావన ఉందన్నారు. ఇక్కడికి దర్శనం కోసం వచ్చే భక్తులకు త్వరలోనే బోటు సౌకర్యం కల్పిస్తామన్నారు. పుష్కరఘాట్ల వద్ద ఎప్పటికప్పుడు పరిశుభ్ర వాతావరణం ఉండేలా శానిటేషన్ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పంచదేవ్‌పహాడ్ శ్రీపాద చాయ ఆశ్రమం వద్ద భక్తులకు, పుష్కర విధులకు వచ్చిన సిబ్బందికి అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. వల్లభాపురం దత్తపీఠం వద్ద కూడా ఆర్యవైశ్య సంఘం, దత్తకమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెంకు సూచించారు.

స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థల నుంచి వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. అనంతరం మాగనూర్ మండలంలోని కృష్ణా, తంగిడి పుష్కరఘాట్లను ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి దేవరి మల్లప్పతో కలిసి మం త్రి పరిశీలించారు. ఆయా కార్యక్రమాల్లో నారాయణపేట ఆర్డీవో శ్రీనివాసులు, మక్తల్ తహసీల్దార్ ఓంప్రకాష్, టీఆర్‌ఎస్ నాయకులు గవినోళ్ల గోపాల్‌రెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, దత్తప్ప తదితరులు పాల్గొన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%A6%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B1%81%E0%B0%95%E0%B1%8B%E0%B0%B5%E0%B0%A1%E0%B0%82-%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%9C%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%B8%E0%B1%81%E0%B0%95%E0%B1%83%E0%B0%A4%E0%B0%82-20-597396.aspx