నేటితో ముగియనున్న కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు నేటితో ముగియనున్నాయి. చివరిరోజైన నేడు ఇరు తెలుగు రాష్ర్టాల్లోని ఘాట్లకు భక్తులు, యాత్రికులు పుష్కరస్నానానికి పోటెత్తుతున్నారు. పుష్కరాల ముగింపు సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సోమశిల, రంగాపూర్, గొందిమల్ల, బీచుపల్లి, నాగార్జునసాగర్ వద్ద ప్రత్యేక హారతి కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డిలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Source:http://www.namasthetelangaana.com/telangana-news/krishna-puskaraalu-end-today-1-1-502282.html