పంచ మహామునుల క్షేత్రం.. పంచదేవ్‌పహాడ్

పంచ మహామునుల క్షేత్రంగా పంచదేవ్‌పహాడ్ గ్రామం పిలువబడుతోందని శ్రీ శివానంద సరస్వతీ మహరాజ్ పేర్కొన్నారు. పన్నెండేళ్లకో సారి వచ్చే పవిత్ర కృష్ణానది దర్శనం, స్నానంతో సకల పాపాలు, శతృభయం, రోగ నివారణ జరుగుతుందన్నారు. కృష్ణానది తీరాన ఉన్న పంచదేవ్‌పహాడ్ ప్రత్యేకతను కలిగి ఉందన్నారు. రామాయణం, మహాభారతం వేదశాస్త్రానుసారంగా శుక్లాచార్య, బృగుమహిర్షి, అగష్ట్య, రోమఋషి, కణువ మహారుషిలు నివసించిన ప్రాంతమే పంచదేవ్‌పహాడ్‌గా పేరొన్నదన్నరు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A-%E0%B0%AE%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82-%E0%B0%AA%E0%B0%82%E0%B0%9A%E0%B0%A6%E0%B1%87%E0%B0%B5%E0%B1%8D%E2%80%8C%E0%B0%AA%E0%B0%B9%E0%B0%BE%E0%B0%A1%E0%B1%8D-20-597387.aspx