పదకొండో రోజు ఘనంగా కొనసాగుతోన్న కృష్ణా పుష్కరాలు

కృష్ణమ్మ ఒడిలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. కృష్ణా నదీ తీరం పుష్కర కళను సంతరించుకుంది. ఇవాళ పదకొండో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కృష్ణా నది తీరంలో పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేస్తూ తరిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రవాణా, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.