పుష్కరఘాట్లలో మంత్రుల ఏరియల్ సర్వే

IJArealSurvey

జిల్లాలోని పుష్కరఘాట్లను ఇవాళ మంత్రులు జగదీష్‌రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. కృష్ణా నది తీరాన ప్రభుత్వం ఏర్పాటు చేసిన పుష్కరఘాట్లలో భక్తులకు అందుతోన్న సౌకర్యాలను పరిశీలించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మిట్టపల్లి ఘాట్లను పరిశీలించారు. పుష్కర ఘాట్‌లలో భక్తులను అడిగి వారికి కలుగుతోన్న సౌకర్యాలను ఆరా తీశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రులు తెలిపారు. భక్తులు సంయమనం పాటించి పుష్కర స్నానాలు చేయాలని, దేవాలయాల్లో క్యూ పద్ధతిలో దేవున్ని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఇవాళ ఐదో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

Source:
http://www.namasthetelangaana.com/telangana-news/jagadishreddy-indhrakaran-reddy-areal-survey-1-1-501443.html