పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు

పుష్కరాల సందర్భంగా స్వయంగా ఘాట్ల వద్దకు వెళ్లి పుణ్యస్నానాలు చేయలేని వారికి పుష్కరఘాట్ల నుంచి సేకరించిన నీటిని సీసాల ద్వారా సరఫరా చేసేందుకు తపాలా శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ సూర్యనారాయణరావు తెలిపారు. 200 ఎంఎల్ నీటి సీసా ధర రూ.90గా నిర్ణయించినట్లు చెప్పారు. రవాణాతో పాటు నిర్వహణ ఖర్చులు అదనంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.
source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%85%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-20-596513.aspx