పుష్కరాలకు పటిష్ట బందోబస్తు – డీజీపీ అనురాగ్ శర్మ

తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణా పుష్కరాలకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లాలో పుష్కరఘాట్లను డీజీపీ హెలికాప్టర్‌లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాగనూర్ మండలంలోని కృష్ణ పుష్కరఘాట్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లోని మొత్తం 80ఘాట్లకు పెద్ద ఎత్తున పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, పుకార్లను నమ్మకుండా జాగ్రత్త వహించాలని భక్తులకు సూచించారు. ఈ సందర్భంగా నారాయణపేట డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డితో భద్రతా చర్యల గురించి చర్చించారు. డీజీపీ వెంట ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీ అంజనీకుమార్ తదితరులు ఉన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AA%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F-%E0%B0%AC%E0%B0%82%E0%B0%A6%E0%B1%8B%E0%B0%AC%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81-20-597648.aspx