పుష్కరాలకు సకల సౌకర్యాలు

రాష్ట్రంలో మొదటి సారి జరుగుతున్న పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అలంపూర్ మండలం గొందిమళ్ల ఘాట్‌లో సీఎంతో పాటు పుష్కరాలను ప్రారంభించిన అనంతరం బీచుపల్లి పుష్కర ఘాట్‌ను ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఘాట్‌లకు వెళ్లి సౌకర్యాల కల్పన గురించి భక్తులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బీచుపల్లితో పాటు ప్రధాన పుష్కర ఘాట్లలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. భక్తులు నదిలో స్నానం చేసే సందర్భంలో భక్తులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వీఐపీ ఘాట్‌లతో పాటు జనరల్ ఘాట్‌లలో సైతం ఏర్పాట్లు సంతృప్తి కరంగా ఉన్నాయని భక్తులు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలకు తెలిపారు. 23 వరకు భక్తులు మనస్పూర్తిగా పుష్కరిణిలో స్నానమాచరించేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పుష్కరిణిలో భక్తులు స్నానమాచరించిన భక్తులు పిండ ప్రధానాలు చేశా రు. మంత్రి వెంట స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.