పుష్కరాలను సీసీ పుటేజీల్లో పరిశీలించిన మంత్రి

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 28పుష్కర ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల వివరాలతోపాటు నిఘాకు సంబంధించిన అంశంపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయగా, సోమవారం మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఎస్పీ కార్యాలయంలో సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్, జేసీ సత్యనారాయణ ఉన్నారు.