పుష్కరాలలో..ఈ-టెక్నాలజీ

కృష్ణ పుష్కరాల సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కరఘాట్ల దగ్గర భక్తుల కు ఇబ్బందులు కలుగకుండా మొదటి సారిగా ఈ టెక్నాలజీని వాడుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. పుష్కరాల ఏర్పాట్ల సందర్భంగా జిల్లా పోలీసు ట్రేనింగ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సిబ్బంది సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా పుష్కరఘాట్ల దగ్గర డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు షీటీంలను ఏర్పాటు చేసి వారిని మాఫీటీలో స్పై కెమెరాలతో భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇక వాహనాలలో వచ్చే భక్తుల కోసం దా దాపు 25 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ దగ్గర నుంచి ఘా ట్లకు వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలలో భక్తులకు ఇబ్బందులు కలుగ కుండా ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ఘాటు దగ్గర సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. పుష్కర ఘాట్ల దగ్గర పిక్‌ప్యాకెట్ దొంగల కోసం 25 స్పెషల్ క్రైం పోలీసు స్టేషన్లను ఏర్పాట్లు చేశామని, భక్తుల సౌల భ్యం కోసం ఇదివరకే క్రిస్‌పీ అనే మొబైల్ యాప్‌ను సిద్ధం ఇం టర్ నెట్‌లో ఉంచామని, అందులో పోలీసు స్టేషన్లకు సంబంధించి, హెల్త్‌కు సంబంధించి అన్ని విషయాలు అందుబాటులో ఉంచామన్నారు. ఇక ప్రతి ఘాటు ప్రారంభం దగ్గర పోలీసు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఫైర్ సిబ్బందితో కలిసి ఘాట్ల దగ్గర ప్రమాదాలు జరగినప్పుడు సిద్ధంగా ఉండేందుకు ప్రత్యేక బోట్లను సిద్ధంగా ఉంచామని, ఇవే కాకుండా జిల్లా మొత్తంలో దాదాపు 4500మంది స్వచ్ఛంద కార్యకర్తల సేవలను వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. 3వేల మంది పోలీసులు బయటి జిల్లాల నుం చి రాగా 3800మంది జిల్లా పోలీసులు పుష్కరాలలో సేవలందిస్తున్నట్లు తెలిపారు.

ఎప్పటి కప్పుడు పు ష్కర ఘాట్ల సమచారాన్ని తెలుసుకునేందుకు సి బ్బంది మెసేజ్‌లు, సీసీ కెమెరాలు, డిజిటల్ డిస్‌ప్లే లు, మొబైల్ యాప్‌లు ఇలా ఈటెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్నట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. పుష్కర స్నానాల కోసం జిల్లాకు వచ్చే భక్తులు ఇక్కడి ఏర్పాట్లతో ఆనందంతో ఇంటికి తిరిగి క్షేమంగా చేరుకునేలా పోలీసులు తమ తమ విధులను నిర్వహించాలని వారికి సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సిబ్బందితో పాటు ఇతర జిల్లాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

హోంగార్డుల సమస్య డీజీ దృష్టికి తీసుకెళ్లాం
పుష్కర విధులు నిర్వహించేందుకు వచ్చిన హోం గార్డులకు ప్రత్యేక గ్రాంట్ ప్రభుత్వం నుంచి ఇవ్వలేదని, ఇక్కడి వచ్చిన వారికి తమ నిధుల నుంచే భోజన వసతులు కల్పించినట్లు ఎస్పీ తెలిపారు. హోంగార్డులు మంగళవారం తమకు ఇంతవరకు టీఏలు ఇవ్వడం లేదని ధర్నాకు దిగిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, సాయంత్రం వరకు సమస్య పరిష్కారం కావచ్చని అన్నారు.
Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%88-%E0%B0%9F%E0%B1%86%E0%B0%95%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2%E0%B0%9C%E0%B1%80-20-596528.aspx