పుష్కరాలలో కొనసాగుతున్న వైఫై సేవలు

జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన పుష్కరాల సందర్భంగా పస్పుల, అలంపూర్, నందిమళ్ల, బీచుపల్లి, పాతాళగంగ తదితర పుష్కర ఘాట్లలో ప్రతి రోజు అరగంట వైఫై సేవలు ఉచితంగా అందజేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచించిన 300 మంది అధికారులకు 24 గంటలు వైఫై సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే గొందిమళ్ల, రంగాపూర్, నదీఅగ్రహారం, పెద్దచింతరేవుల తదితర ప్రాంతాల్లో బీటీఎస్ సేవలతోపాటు 3జీ సేవలు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్కెటింగ్ విభాగం నుంచి 48మంది టెలిఫో న్ మెకానిక్‌లు, అధికారులు, సిబ్బంది, తదితరులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నూతనంగా వినియోగదారుల కోసం మార్కెట్‌లోకి 49, 470 కాంబ్లో ప్లాన్‌లు అమలులోకి వచ్చిందన్నారు. 49 ప్లాన్ 90 రోజుల ఆఫర్ ఉందని, దీని వ్యాలిడిటీ 6 నెలలు మాత్రమేనని తెలిపారు. అలాగే ల్యాండ్‌లైన్లు ఫోన్లు తీసుకున్న ఎలాంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు తీసుకోమని వారు చెప్పారు. సమావేశంలో డీజీఎంలు అబేద్‌అలీ, వేణుగోపాల్, ఎస్‌డీఈ హేమలత, జేటీవోలు సక్రూనాయక్, శశి తదితరులు పాల్గొన్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AB%E0%B1%88-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%B2%E0%B1%81-20-598055.aspx