పుష్కరాల ఏర్పాట్లు భేష్

-జోగుళాంబ ఘాట్‌లో గవర్నర్ దంపతుల పుణ్యస్నానం..
-స్వాగతం పలికిన మంత్రులు, కలెక్టర్, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేలు..
-జోగుళాంబ ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం..
-అభిషేకం, అర్చన, కుంకుమార్చనలతో ప్రత్యేక పూజలు..
-ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తుంది..
-మంత్రులు, కలెక్టర్ కలిసి పనిచేశారు..
-గోదావరి, కృష్ణా పుష్కరాలను విజయవంతం చేశారు..
-ప్రభుత్వంలో వ్యవసాయానికి పెద్దపీట..
-గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్..

కృష్ణా పుష్కరాలను ఎంతో గొప్పగా ఏర్పాటు చేశారని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. పుష్కరాల 9వ రోజు శనివారం గవర్నర్ దంపతులు అలంపూర్ జోగుళాంబ పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం ఆచరించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా చేరుకున్న గవర్నర్ దంపతులకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, జడ్పీ చైర్మన్ భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, సంపత్‌కుమార్, కలెక్టర్ శ్రీదేవి, ఎస్పీ రెమారాజేశ్వరి ఘనస్వాగతం పలికారు.

గవర్నర్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత వేద పండితులు సంకల్పం చేయించారు. అనంతరం అలంపూర్ చేరుకొని బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారికి ప్రత్యే క పూజలు చేశారు. ప్రభుత్వం ప్రజల మేలు కోస మే పని చేస్తుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. కృష్ణా పుష్కర ఏర్పాట్లన్ని బేషుగ్గా ఉన్నాయని ఆయన కితాబిచ్చారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AD%E0%B1%87%E0%B0%B7%E0%B1%8D-20-599100.aspx