పుష్కరోత్సవం.. పుణ్యోత్సవం!

పుష్కర మహోత్సవం.. పుణ్యోత్సవంలా సాగుతున్నది. మంగళవారం దాదాపు ఎనిమిది లక్షలకు పైగా స్నానమాచరించారు. బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, గొందిమళ్ల, నదీఅగ్రహారం, పస్పుల, క్రిష్ణా(మాగనూరు) ఘాట్లకు భక్తులు భారీగా తరలివచ్చారు. రంగాపురంలో మంత్రి మహేందర్‌రెడ్డి, జోగుళాంబ ఘాట్‌లో మంత్రి లకా్ష్మరెడ్డి, వరంగల్ కలెక్టర్ కరుణలు కుటుంబ సమేతంగా పుష్కరస్నానమాచరించారు. మంత్రి జూపల్లి, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవిలు పుష్కరఘాట్లను పరిశీలించారు. కృష్ణమ్మకు సంధ్యవేళ నదీహారతిలో నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.

పాలమూరు జిల్లాలో పుష్కరస్నాన మహోత్సవం పండుగలా సాగుతున్నది. మంగళవారం లక్షలాది మంది భక్తజనం పుష్కరాల్లో పాల్గొన్నారు. ప్రధానఘాట్లలో భక్తులు యధావిధిగా పాల్గొని పుణ్యస్నానమాచరించారు. బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, గొందిమళ్ల, నదీఅగ్రహారం, పస్పుల, క్రిష్ణా(మాగనూరు) ఘాట్లలో భక్తులు భారీగా వచ్చారు. రంగాపురంలో రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, జోగుళాంబ ఘాట్‌లో మంత్రి లకా్ష్మరెడ్డి, వరంగల్ కలెక్టర్ కరుణలు కుటుంబ సమేతంగా పాల్గొని స్నానమాచరించారు. అలాగే మంత్రి జూపల్లి, లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, కలెక్టర్ శ్రీదేవిలు పుష్కరఘాట్లను పరిశీలించారు.

5 వ రోజు 8 లక్షల మంది భక్తులు
జిల్లాలో సాగుతున్న పుష్కర వేడుకల్లో ఐదో రోజు 8 లక్షల మంది భక్తులు పాల్గొన్నట్లు అధికారుల అంచనా. ఇప్పటివరకు జిల్లాలో మొత్తంగా 50 లక్షల మంది పుష్కరస్నానమాచరించినట్లు కలెక్టర్ శ్రీదేవి తెలిపారు. జిల్లాలోని ప్రధానఘాట్లలో జన రద్దీ నెలకొంది.
-ఐదో రోజు 8 లక్షల మంది పుణ్యస్నానాలు..
-రంగాపుర్ ఘాట్‌లో మంత్రి మహేందర్‌రెడ్డి
-గొందిమళ్లలో వరంగల్ కలెక్టర్ కరుణ
-పర్యవేక్షించిన మంత్రులు జూపల్లి, లకా్ష్మరెడ్డి,
-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్ భాస్కర్
-ఇప్పటివరకు 50 లక్షల మంది పుష్కర స్నానం చేసినట్లు అంచనా..

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B1%8B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B8%E0%B0%B5%E0%B0%82-20-598068.aspx