పుష్కర ఘాట్లకు స్ప్రే కిట్ల పంపిణీ

జిల్లాలో కృష్ణా పుష్కరాలు శుక్రవారం నుంచి 52 ఘాట్లలో రాష్ట్రంలోని తెలంగాణ పది జిల్లాల నుంచి అత్యధికంగా భక్తులు పుష్కర స్నానాలు ఆచరించడానికి రానున్నారు. జిల్లా పంచాయతీరాజ్ కార్యాలయంలో అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి ఇన్‌చార్జిగా మహబూబ్‌నగర్ డీఎల్‌పీవో వెంకటేశ్వర్లును నియమించారు. గురువారం సాయంత్రం పుష్కర ఘాట్లకు స్ప్రే కిట్లను తరలించనున్నట్లు ఆయన తెలిపారు. చిన్న ఘాట్లకు ఒక్కొక్క కిట్‌ను పంపిణీ చేస్తున్నామన్నారు. పెద్దఘాట్లకు 2 కిట్ల చొప్పున పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచామన్నారు. ఆ పుష్కరఘాట్ల ఇన్‌చార్జీలకు రవాణా ద్వారా నేటి రాత్రి వరకు చేరవేయనున్నట్లు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

Source:

http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B1%87-%E0%B0%95%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AA%E0%B0%82%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A3%E0%B1%80-20-596906.aspx