పుష్కర బతుకమ్మ అభినందనీయం

-కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ
తెలంగాణా రాష్ట్ర సాంప్రదాయం ఉట్టిపడేలా ఆర్యవైశ్య సంఘం వారు పుష్కర బతుకమ్మను నిర్వహించటం అభినందనీయమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వారిని అభినందించారు. శనివారం రంగాపూర్ పుష్కరఘాట్‌లో స్థానిక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కేంద్రం వద్ద ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో కృష్ణాపుష్కరాలను పురస్కరించుకుని పుష్కర బతుకమ్మ ఉత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు సంబు జయప్రకాష్ ఆహ్వానం మేరకు కేంద్రమంత్రి దంపతులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సబ్బిరెడ్డి వెంకట్‌రెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుకొనే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని ఆయన అన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సతీమణి వాసంతి ఆయన కుటుంబ సభ్యులు బతుకమ్మ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ, జిల్లా, రాష్ట్ర, వివిధ తాలూకాల ఆర్యవైశ్య సంఘం సభ్యులు, నాయకులు, మహిళా సంఘాలు పాల్గొన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%AC%E0%B0%A4%E0%B1%81%E0%B0%95%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B1%80%E0%B0%AF%E0%B0%82-20-599088.aspx