పుష్కర భక్తులకు భద్రతా ఏర్పాట్లు

కృష్ణాపుష్కరాల సం దర్భంగా సౌత్ సెంట్ర ల్ డీఆర్‌ఎం అరుణాసింగ్, ఆర్పీఎఫ్ సీనియర్ డీఎస్‌సీ ఎం ఎస్ సునీల్ పర్యవేక్షణలో పుష్కర భక్తుల కు భద్రతా ఏర్పాట్లు చేశామని ఆర్పీఎఫ్ డివిజన్‌లో అసిస్టెంట్ కమిషనర్ సీజే చక్రధర్ పేర్కొన్నారు. పుష్కరాల సందర్భంగా ఆదివారం గద్వాలకు వచ్చిన ఆయన ఆర్పీఎఫ్ ఇన్స్‌పెక్టర్ రాజు, సబ్ ఇన్స్‌పెక్టర్ సంజీవరావులతో కలిసి రైల్వే స్టేషన్‌లోని వీఐపీ విశ్రాంతి గదిలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చక్రధర్ మాట్లాడుతూ పుష్కరాల ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఆర్పీఎఫ్, జీఆర్‌పీ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలందిస్తున్నారన్నారు. వారి సేవలు భేషుగ్గా ఉన్నాయన్నారు. గద్వాల, ఆరేపల్లి, అలంపూర్ తదితర రైల్వే స్టేషన్‌లలో రైల్వే పోలీసు బలగాలు విధులు నిర్వహిస్తున్నారని అసిస్టెంట్ కమిషనర్ పేర్కొన్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%95%E0%B1%81-%E0%B0%AD%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%8F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-20-599364.aspx