పుష్కర భక్తులు @..64.50లక్షలు

-పులకిస్తున్న పాలమూరు
-వైభవంగా సాగుతున్న కృష్ణవేణి పుష్కరాలు
-లక్షలాదిగా తరలి వస్తున్న భక్తజనులు
-ప్రధాన ఘాట్లల్లో అద్భుతమైన ఏర్పాట్లు
-భక్తులను అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
-పర్యవేక్షణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు
పుష్కరాలు అనుకున్న దానికంటే విజయవంతంగా సాగుతున్నాయి. మంత్రులు, అధికారులు నిరంతర పర్యవేక్షణ తో పుష్కర సంబురం సజావుగా సాగిపోతుంది. ఆరు రోజుల పాటు చల్లని వాతావరణంలో భక్తజనం పుణ్యస్నానాలు ఆచరించగా, గురువారం సూర్య కిరణంతో కాస్తా వేడి పుట్టించింది.

జిల్లాలోని ప్రధాన ఘాట్లన్ని జనసంద్రం తో నిండుకుండలా కనిపిస్తున్నాయి. నూతన రాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన పుష్కరాలను ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో మన మంత్రులు, అధికారుల పనితీరుకు అద్దంపట్టె విధంగా పుష్కర ఏర్పాట్లు తెలియ పరుస్తున్నాయి. వారం రోజులుగా జరుగుతున్న పుష్కర సంబురంతో పాలమూరు పులకించి పోతున్నది.
– ప్రధాన ఘాట్లలో నిండుకున్న జనం..

జిల్లాలోని ప్రధాన పుష్కర ఘాట్లలో జనరద్దీ నిలకడగా సాగుతుంది. రంగాపూర్, సోమశిల, బీచుపల్లి, గొందిమళ్ల, నదిఅగ్రహారం, పస్పుల, కృష్ణ(మాగనూరు) పుష్కర ఘాట్లలో ప్రతిరోజు నిండుకుంటున్నారు. ఉదయం వేలల్లో కాస్తా నెమ్మదిగా ఉన్న ఘాట్లు పది గంటల అనంతరం నిండుకుంటున్నా యి.

ఘాట్లలో ఆశించినంత జనం వస్తుండటం వల్ల మంత్రులు, అధికారులు, సిబ్బంది సంతృప్తితో తమ సేవలను అందిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 52 ఘా ట్లను ఏర్పాటు చేస్తే వాటిలో జనసంచారం లేని కొన్ని ఘాట్లకు నీటి ఇబ్బందులు వచ్చాయి. దీని వల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేవు.
మరో ఆరు రోజుల పాటు పు ష్కరాలకు తరలి వచ్చే భక్తులకు ఈ ప్రధాన ఘాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వారం రోజుల్లో 64 లక్షల మంది భక్తులు
వారం రోజుల పాటు సాగుతున్న పుష్కరలో జిల్లా వ్యాప్తంగా 6450వేల మంది భక్తజనం పుణ్యస్నాన మాచరించారు. ప్రధానఘాట్ల ద్వారా ఎక్కువ మంది జ నం పుష్కరాల్లో పాల్గొంటున్నారు. బీచుపల్లి, రంగాపూర్, సోమశిల, గొందిమళ్ల, నదిఅగ్రహారం, పస్పుల పుష్కరఘాట్లలో లక్షలాది మంది ప్రజలు నదిలో స్నానమాచరిస్తున్నారు. చివరి వరకు ఈ సంఖ్య మరింత అవకాశం ఉం దని అంచనా వేస్తున్నారు.

పర్యవేక్షిస్తున్న మంత్రులు, అధికారులు
జిల్లాలో సాగుతున్న పుష్కర ఏర్పాట్లలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిలు నిరంతరాయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే కలెక్టర్ శ్రీదేవి అన్ని ప్రధాన ఘాట్లలో ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. బీచుపల్లి పుష్కరఘాట్‌లో జేసీ రాంకిషన్, రంగాపూర్ ఘాట్ లో ఏజేసీ రంజిత్‌ప్రసాద్, డ్వామా పీడీ కట్టా దామోదర్‌రెడ్డిలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-64-50%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B2%E0%B1%81-20-598537.aspx