పుష్కర స్నానం ఆచరించిన సీఎం కేసీఆర్

CMKCRKRISHకన్యారాశిలో బృహస్పతి ప్రవేశించడంతో కృష్ణా పుష్కరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వేద పండితుల మంత్రోచ్ఛరణలు పటిస్తుండగా పుష్కరాలను ప్రారంభించారు. గొందిమళ్ల ఘాట్ దగ్గర సీఎం కేసీఆర్ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. కృష్ణమ్మ తల్లికి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు, లక్ష్మారెడ్డి దంపతులు, ఎమ్మెల్యే శ్రీనివాస్, కలెక్టర్ యోగితారాణి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా మట్టపల్లి ఘాట్ దగ్గర మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు పుష్కరాలను ప్రారంభించారు. అనంతరం జగదీశ్‌రెడ్డి కుటుంబసభ్యులు పుష్కరస్నానమాచరించారు. సీఎం కేసీఆర్ అలంపూర్ జోగులాంభ దర్శనం కోసం బయలుదేరారు. కాసేపట్లో అమ్మవారిని, బాలబ్రహ్మేశ్వర స్వామివారిని దర్శనం చేసుకోనున్నారు.

జోగులాంభ దర్శనం..
కృష్ణానదిలో పుష్కర స్నానం ఆచరించిన అనంతరం సీఎం కేసీఆర్ అలంపూర్ జోగులాంభ అమ్మవారి సన్మిధికి చేరుకున్నారు. ఆలయ పూజారులు, సిబ్బంది, వేదపండితులు సీఎంకు స్వాగతం పలికారు. కేసీఆర్ దంపతులు అమ్మవారు, బాలబ్రహ్మేశ్వర స్వామివారి దర్శనం అనంతరం జోగులాంభ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ యోగితారాణి పాల్గొన్నారు.

Source:

http://www.namasthetelangaana.com/telangana-news/telangana-cm-kcr-take-holy-dip-at-krishna-pushkaralu-1-1-500896.html