ప్రభంజనం

-జనసంద్రమైన ప్రధానఘాట్లు..
-ప్రధానరోడ్లన్నీ ట్రాఫిక్… ట్రాఫిక్..
-సోమశిలలో కంట్రోల్ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు..
-ఉదయం నుంచి రాత్రి వరకు తగ్గని రద్దీ..
-పారేవులలో ఎంపీ పాల్వాయి..
-రంగాపూర్, బీచుపల్లిలో సినీ దర్శకుడు శంకర్, నటుడు సునీల్..
-10వ రోజు పుష్కరంలో 35లక్షల మంది స్నానాలు..
-రంగాపూర్ నదీహారతి ఇచ్చిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కలెక్టర్..
పాలమూరు పుష్కర ప్రభంజనమైంది. కృష్ణాతీరం జనసంద్రమైంది.. దారులన్నీ కృష్ణమ్మ చెంతకే అన్నట్లుగా రహదారులు రద్దీగా మారాయి. పది రోజులుగా సాగుతున్న ఈ మహోత్సవంలో ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ప్రధాన పుష్కరఘాట్ల ప్రాంతాల్లో చెట్టు, పుట్ట, గట్టు అన్నీ జనంతో నిండిపోయాయి. సోమశిల పుష్కరఘాట్ వద్ద దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

వాహనాల రాకపోకలకు బ్రేక్ పడటంతో మంత్రి జూపల్లి రంగంలోకి దిగారు. టూవీలర్‌పై వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 35 లక్షల మంది ప్రజలు పుష్కరస్నానమాచరించినట్లు అంచనా. సంధ్యవేళ రంగాపూర్ ఘాట్‌లో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్రీదేవి ఇచ్చిన నదీహారతి కన్నులపండువగా జరిగింది.

పాలమూరు జిల్లా పుష్కర ప్రభంజనమైంది. పది రోజులుగా సాగుతున్న ఈ మహోత్సవంలో ప్రజలు తండోపతండాలుగా తరిలి వచ్చి పుష్కరస్నానమాచరిస్తున్నారు. ప్రధాన పుష్కరఘాట్ల ప్రాంతాల్లో చెట్టు, పుట్ట, గుట్లు అన్నీ జనంతో నిండిపోయాయి. పుష్కరాలకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండటంతో జిల్లాలోని ప్రధాన ఘాట్లన్ని జనసంద్రమయ్యాయి. అధికారులు, పోలీసులు కంట్రోల్ చేయలేనంత పరిస్థితి. సోమశిల పుష్కరఘాట్‌లో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

సోమశిల నుంచి కొల్లాపూర్ వరకు వాహనాల రాకపోకలకు బ్రేక్ పడటంతో స్వయంగా మంత్రి జూపల్లి రంగంలోకి దిగారు. టూవీలర్‌పై వెళ్లి మంత్రి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి పుష్కరఘాట్‌కు వెళ్లి మైకు ద్వారా ట్రాఫిక్ రద్దీపై భక్తులు సహకరించాలని సూచనలు చేస్తూ స్నానాల వేగవంతానికి మంత్రి జూపల్లి కృషి జిల్లాలోని ప్రధాన ఇలాగే రద్దీ కొనసాగింది. రంగాపూర్, సోమశిల, బీచుపల్లి, జోగుళాంబ, నదీఅగ్రహారం, పస్పుల, క్రిష్ణ పుష్కరఘాట్లలో భక్తుల రద్దీ అంచనాలకు అందకుండా పెరిగిపోయింది. పస్పుల ఘాట్‌లో స్నానమాచరించాలనుకున్న కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రద్దీ ఎక్కువగాఉండటంతో పారేవుల ఘాట్‌లో స్నానమాచరించారు.

పస్పుల ఘాట్‌లో మాజీ ప్రధా పీవీ నరసింహారావు సోదరుడు ప్రభాకర్‌రావు, బీచుపల్లిలో సినీహీరో సునీల్, జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జి రాధికాదేవి, రంగాపూర్‌ఘాట్‌లో దర్శకుడు ఎన్‌కౌంటర్ శంకర్, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డిలు స్నానమాచరించారు. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 30 లక్షల మంది ప్రజలు పుష్కరస్నానమాచరించారు. ఉదయం 6గంటల నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. సోమ, మంగళవారాలు సైతం ఇంతకంటే భారీగా జనం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-20-599373.aspx