ప్రభంజనం..

-ఏడో రోజు పుష్కరఘాట్లకు పోటెత్తిన భక్తజనులు
-జిల్లా వ్యాప్తంగా 3లక్షల మంది పుణ్య స్నానాలు
-అడవిదేవులపల్లి ఘాట్‌లో వీవీఎస్ లక్ష్మణ్ పుష్కరస్నానం
పుష్కరాల్లో ఏడో రోజూ కృష్ణా తీరం పోటెత్తింది. రాఖీ పౌర్ణమి వేళ భక్తజనుల పుణ్యస్నానాలతో నదీ తీరం శోభిల్లింది. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పుష్కర ఘాట్లన్నీ పిండ ప్రదానాలు, పుష్కర స్నానాలకు వచ్చిన వారితో కిటకిట లాడాయి. జిల్లాలో గురువారం సుమారు 3లక్షల మంది పుష్కర స్నానాలు చేయగా, అత్యధికంగా సాగర్‌లో లక్షా 10వే మంది భక్తులు పాల్గొన్నారు. భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, జేసీ సత్యనారాయణ, ఎస్పీ ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం సహా పలువురు ప్రముఖులు పుష్కర స్నానం ఆచరించారు.

కృష్ణా పుష్కర తీరం భక్తజనంతో పోటెత్తింది. పుష్కరాల్లో ఏడో రోజూ జిల్లాలోని 28 ఘాట్లు భక్త జనంతో కిక్కిరిసాయి. జిల్లాతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చిన ప్రజలు కృష్ణానది చెంత ఉన్న వివిధ ఘాట్లలో పుష్కర స్నానాలు ఆచరించారు. అనంతరం దైవ దర్శనాలు చేసుకున్నారు. పుష్కరాల ప్రథమార్థం ఆరు రోజులు కొనసాగిన ఉత్సా హం రాఖీ పౌర్ణమి శుభ సందర్భాన ఏడో రోజూ కొనసాగింది. ఘాట్ల చెంత గురువారం అన్నాచెల్లెల్లు, అక్కాతమ్ముళ్ల మధ్య రాఖీ పండుగ దృశ్యాలు వెల్లువెత్తాయి.

ఏడో రోజూ జిల్లాకు 3లక్షల మంది భక్తులు..
జిల్లా వ్యాప్తంగా ఉన్న పుష్కర ఘాట్లకు ఏడో రోజు భ క్తులు తరలి వచ్చారు. గురువారం సుమారు 3లక్షల మం ది భక్తులు హాజరు కాగా ప్రధానంగా నాగార్జునసాగర్‌లో అత్యధిక మంది భక్తుల పుష్కర స్నానాలతో పోటెత్తింది. సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో సుమారు 90వేల మం ది భక్త జనులు పుష్కర స్నానం ఆచరించగా సుర్గి వీరాంజనేయ స్వామి ఘాట్‌లో 19వేల మంది పాల్గొన్నారు.

చందంపేట మండలం కాచరాజుపల్లి పుష్కర ఘాట్‌లో న దీ జలాలచెంతకు భక్తులను అనుమతించడంతో పుష్కర సానాలతో నదీ తీరం కిక్కిరిసింది. సుమారు 10వేల మం ది భక్తులు ఒక్క రోజే ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించ డం విశేషం. వాడపల్లిలో సుమారు 80 వేల మంది భక్తు లు పుష్కర వేడుకల్లో పాల్గొనగా, అడవిదేవులపల్లిలోను భారీగా భక్తుల రద్దీ కొనసాగింది. మట్టపల్లిలో 25వేల మంది, మహంకాళిగూడెంలో 10వేల మంది, మేళ్లచెర్వు మండలంలో 10వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. నల్లగొండలోని పానగల్, దర్వేశిపురం ఘా ట్లు భక్తుల పుష్కర స్నానాలతో కిక్కిరిసి కనిపించాయి.

పలువురు ప్రముఖుల హాజరు..
ఏడో రోజు పుష్కరాల్లో జిల్లా వ్యాప్తంగా పలువురు ప్ర ముఖులు హాజరు కాగా దామరచర్ల మండలం అడవిదేవులపల్లి ఘాట్‌లో ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కు టుంబ సమేతంగా పుష్కర స్నానం చేశారు. జేసీ సత్యనారాయణ కుటుంబ సభ్యులతో కలిసి ముదిమాణిక్యంలో పుణ్యస్నానం చేయగా ఎస్పీ ప్రకాష్‌రెడ్డి ఇర్కిగూడెంలో సోదరుడితో కలిసి పిండప్రదానం నిర్వహించి పుణ్య స్నా నాలు చేశారు.

ఎమ్మెల్యే వేముల వీరేశం కుటుంబ సభ్యులతో కలిసి వాడపల్లి శివాలయం ఘాట్‌లో పుష్కర స్నా నాలు చేసి ఆగస్తేశ్వరస్వామి, లక్ష్మీనర్సింహస్వామిని ద ర్శించుకున్నారు. ఏజేసీ వెంకట్రావ్, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి వేర్వేరుగా వాడపల్లిలో పుష్కర స్నానాలు చేశారు. ఇంటిలీజెన్స్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ మట్టపల్లి వద్ద పుష్కర స్నానాలు చేశా రు.

దీంతో పాటు పలువురు ప్రముఖులు జిల్లా వ్యాప్తంగా ఉన్న పుష్కర ఘాట్ల వద్ద స్నానాలు ఆచరించారు. ఎస్పీ ప్రకాష్‌రెడ్డి భక్తుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని మట్టపల్లిలో ఆర్టీసీ బస్‌లో ప్రయాణించారు. సాగర్‌లో బస్‌ల ను కొత్త బ్రిడ్జి వద్దకు అనుమతించిన నేపథ్యంలో భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AD%E0%B0%82%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-22-598556.aspx