బంగారు తెలంగాణకు కృష్ణా పుష్కరాలు నాంది

14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి వచ్చిన కృష్ణా పుష్కరాలు బంగారు తెలంగాణకు నాంది పలకనున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. బుధవారం మండలంలోని జోగుళాంబ ఘాట్ (గొందిమళ్ల)ను ఎమ్మెల్యేలు శ్రీనివాసగౌడ్, సంపత్‌కుమార్, కలెక్టర్ శ్రీదేవిలతో కలిసి ఆయన పరిశీలించా రు. సీఎం కేసీఆర్ పుష్కరాల అంకురార్పణకు జోగుళాంబ ఘాట్‌కు రానున్న దృష్ట్యా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రికి సీఎం అలంపూర్‌కు చేరుకుని అక్కడే బస చేసి శుక్రవారం తెల్లవారుజామున వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శా స్ర్తోక్తంగా పూజలు నిర్వహించి పుష్కరాలకు అంకురార్పణ చేయనున్నట్లు తెలిపారు.

భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేయనున్నట్లు పేర్కొన్నారు. 12 ఏళ్లకు ఒక సారి వచ్చే పుష్కర స్నానంతో పుణ్యం లభిస్తుందని నిరంజన్‌రెడ్డి అన్నారు. వచ్చే భక్తులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. రాష్ట్రంలోని పాలమూరు, నల్లగొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్లలో చక్కని ఏర్పాట్లు చేశామన్నారు. భక్తులు పుష్కరిణిలో స్నానమాచరించి తమ గ్రామాలకు క్షేమంగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు.

పుష్కలంగా నీళ్లు : కలెక్టర్ శ్రీదేవి
తెలంగాణ రాష్ట్రంలో 295 కిలోమీటర్లు ప్రవహిస్తున్న కృష్ణా నదిలో 52 పుష్కర ఘాట్లను నిర్మించగా కేవలం 2 ఘాట్లు మాత్రమే వరద నీటిలో మునిగిపోయాయని కలెక్టర్ శ్రీదేవి తెలిపారు. పుష్కరాలకు నీటి లభ్యత ఉండదేమో అనుకున్న సందర్భంలో వరుణుడు కరుణించడం శుభపరిణామమని అన్నారు. భక్తులకు నీటి ఇబ్బందులు ఇక లేవన్నారు. నీరు ఎంత ఎక్కువైనా భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. భక్తులు పవిత్రంగా స్నానమాచరించాలని అన్నారు.

సబ్బులు, శాంపోలు వాడకుండా స్నానం అతి తక్కువ సమయంలో ముగించుకోవాలని సూచించారు. బహిరంగ మలవిసర్జన చేయొద్దని, 3500 మరుగుదొడ్లను ఏ్పటు చేశామన్నారు. ఘాట్లను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో గురురాజా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఘాట్ ప్రత్యేకాధికారి, సీఈవో లక్ష్మీనారాయణ, టీఆర్‌ఎస్ తాలూకా ఇన్‌చార్జి శ్రీనాథ్, అధికారులు, నేతలు పాల్గొన్నారు.
Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AC%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B1%81-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%95%E0%B1%81-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-20-596526.aspx