భక్తి సాగరం..

-తొమ్మిదో రోజు భక్తులతో కిటకిటలాడిన కృష్ణా పుష్కర ఘాట్లు
-2లక్షల మందితో కిటకిటలాడిన నాగార్జునసాగర్
-ప్రధాన ఘాట్లతోపాటు దర్వేశిపురం, కాచరాజుపల్లిలో రద్దీ
-మిగిలిన మూడ్రోజులూ భక్తులు పోటెత్తే అవకాశం
-9వ రోజు పుష్కరాలకు వచ్చిన భక్తులు :7,00,000మంది..
-నేడు చేయాల్సిన దానాలు : పూలమాల, ముత్యాలమాల, వెండి, శాకం, సాలగ్రామం, పుస్తకం
భక్త జనం పోటెత్తింది. కృష్ణా తీరం హోరెత్తింది. తొమ్మిదో రోజు ఘాట్లన్నీ భక్తుల రద్దీతో కిక్కిరిసాయి. ప్రధానంగా నాగార్జునసాగర్‌లో అత్యధికంగా సుమారు 2లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. వాడపల్లి, మట్టపల్లి సహా అన్ని ఘాట్లూ శనివారం భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం 10గంటల నుంచే ఘాట్ల వద్ద ఎండ తీవ్రత కన్పించగా… భక్తుల రాక కూడా అదే సమయంలో పెరిగింది. సాయంత్రం 4గంటల వరకు ఘాట్లలో భక్తుల పుష్కర స్నానాలు కొనసాగాయి. ఏడాదిపాటు జరగనున్న పుష్కర వేడుకలో తొలి 12రోజులకు ఇంకా మూడు రోజులే మిగిలి ఉన్నందున.. భక్త జనం భారీగా పోటెత్తడం ఖాయంగా కన్పిస్తోంది.

తొమ్మిదో రోజు జిల్లాలోని కృష్ణా పు ష్కర ఘాట్లన్నీ కిక్కిరిశాయి. ఉదయం నుంచే ఘాట్ల వద్ద భక్తుల రద్దీ ప్రారంభమైంది. ప్రధానంగా నాగార్జున సా గర్, వాడపల్లి, మట్టపల్లి, మహంకాళిగూడెం, దర్వేశిపురం, అడవిదేవులపల్లి ఘాట్లు భక్తుల తాకిడితో కిటకిటలాడా యి. తొమ్మిదో రోజు జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల మంది భక్తులు పు ష్కర స్నానాలు చేయగా.. ఒక్క నాగార్జునసాగర్‌లోనే దాదాపు 2 లక్షల మ ంది పాల్గొన్నట్లు అంచనా.

పుష్కర జనంతో పోటెత్తిన సాగర్
శనివారం తొమ్మిదో రోజు అత్యధికంగా నాగార్జున సాగర్ శివాలయం ఘాట్‌లో 1,50,000 మంది భక్తులు పుణ్య స్నానాలు చేశారు. సురికి వీరాంజనేయ స్వామి ఘాట్‌లో 36,000.. పొట్టిచెల్మ వద్ద వెయ్యి మంది భక్తులు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. సాగర్‌లోని పైలాన్ కాలనీ పూర్తిగా జనసంద్రాన్ని తలపించింది. సాగర్‌లో కొంత మేర ఆంక్షలు సడలించిన పోలీసులు ఆర్టీసీ బస్సులను నేరుగా కొత్త బ్రిడ్జి వరకు అనుమతిస్తుండడంతో భక్తులకు సౌకర్యవంతంగా మారింది. దీనికితోడు శనివారం లాంచీ ప్రయాణం కూడా ప్రారంభించడంతో పర్యాటక అనుభూతి సైతం మిగిలింది. కనగల్ మండలం దర్వేశిపురం రేణుకా ఎ ల్లమ్మ దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్‌కు భక్తుల రద్దీ కొనసాగింది.

ఒక్కరోజులోనే ఇక్కడ సుమారు 50 వేల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. మట్టపల్లిలో 1,10,000 మంది భక్తులు రాగా.. 35 వేల మంది భక్తులు మహంకాళిగూడెం లో.. 10 వేల మంది భక్తులు మేళ్లచె ర్వు మండలంలోని వివిధ ఘాట్లలో పుష్కర స్నానాలు ఆచరించారు. చందంపేట మండలం కాచరాజుపల్లిలో 15 వేల మంది భక్తులు పాల్గొన్నారు. పానగల్ ఛాయా సోమేశ్వలా యం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. వాడపల్లితోపాటు దామరచర్ల మండలంలోని 11 ఘాట్లలో కలుపుకుని మొత్తం 1,30,000 మంది భక్తులు పుష్కరస్నానాలు చేశారు.

వివిధ ఘాట్లకు పలువురు ప్రముఖులు
జిల్లాలోని వివిధ ఘాట్లలో పలువురు ప్రముఖులు శనివారం పుణ్య స్నానాలు చేశారు. మట్టపల్లిలో మధురై హైకోర్టు జడ్జి నూతి రామ్మోహన్ రావు, జిల్లా సెషన్స్ జడ్జి రాధారాణి, ఎస్బీహెచ్ సీజీఎం విశ్వనాథం, నల్లగొండ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి, హుజూర్‌నగర్ నగర పంచాయతీ చైర్మ న్ జక్కుల వెంకయ్యలు పుష్కర స్నా నాలు చేశారు. దామరచర్ల మ ండలం ముదిమాణిక్యంపుష్కరఘాట్‌లో కు టుంబ సభ్యులు, బంధువులతో కలిసి పుష్కర స్నానం చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు.. అనంతరం అడవిదేవులపల్లిలోని శివపంచాయతనంలో ప్ర త్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో బంధువులతో కలిసి వచ్చి ఎమ్మెల్యే భాస్కర్ రావు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, సీ ఎం కేసీఆర్ చిన్ననాటి గురువు మృ త్యుంజయశర్మ వాడపల్లిలోని శివాల యం ఘాట్‌లో పుష్కర స్నానాలు చేశారు.

మిగిలిన మూడు రోజులూ భారీగా భక్త జన సందోహం ..!
పుష్కర వేడుకలో ప్రధాన అంకమైన 12 రోజుల్లోని తొలి అర్థభాగం లో అంతంత మాత్రంగానే కొనసాగిన భక్తుల రద్దీ.. ద్వితీయార్థంలో భారీగా పెరుగుతోంది. ఎనిమిదో రోజు జి ల్లాలో సుమారు 6 లక్షల మంది భ క్తులు పుష్కర స్నానాలు చేయగా.. తొమ్మిదో రోజు శనివారం కూడా అదే ర ద్దీ కొనసాగింది. నేడు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు మిగిలిన మూడు రోజులూ ఘాట్లకు భక్తులు పోటెత్తితే వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్నందున చిన్నారులు, వృద్ధుల కోసం ఘాట్ల వద్ద అదనంగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B0%B0%E0%B0%82-22-599122.aspx