భక్తులతో పుష్కరఘాట్లు కళకళ

భక్తుల తాకిడితో నదిఅగ్రహారం పుష్కరఘా ట్‌లు కళకళ లాడాయి. ఉదయం 5.58గంటలకు పుష్కరాలు ప్రారంభం కావడంతో భక్తు లు పెద్ద ఎత్తున పుష్కరస్నానాలు ఆచరించడాని కి వచ్చారు. కొందరు స్నానాలు ఆచరించి ఆలయాల్లో పూ జలు నిర్వహించగా మరి కొందరు తమ పితృదేవతలకు పిండాలు పెట్టారు. చిన్న,పెద్ద ,ముదుసలి అనే తేడా లేకుండా అందరూ పుష్కర స్నానాలు ఆచరించారు. నదికి వరద ప్రవాహాం ఉం డడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పుణ్యస్నానాలు ఆచరించారు. నదిలోకి వెళ్లలేని వారి కోసం పుష్కఘాట్‌లపై శవర్‌బాత్‌లను ఏర్పాటు చేశా రు.అధికారులు భక్తులను ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ ఎటువంటి ఆటంకాలు లేకుండా భక్తులు స్నానాలు ఆచరించేందకు కృషి చేశారు.ట్రాఫిక్ సమ స్య లేకుండా పోలీస్‌లు భధ్రత పటిష్టంగా ఏర్పాటు చేశారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%95%E0%B0%B3%E0%B0%95%E0%B0%B3-20-597148.aspx