భారీగా పెరిగిన భక్తులు

మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధానఘాట్లన్నీ భక్తజనంతో కిక్కిరిసి పో యాయి. సోమవారం రంగాపూర్, బీచుపల్లి, సోమ శిల, గొందిమళ్ల, పస్పుల, నదీఅగ్రహారం, క్రిష్ణా (మాగనూరు), నందిమళ్ల డ్యాం తదితర ప్రధాన ఘాట్లన్నీ ఇసుకేస్తే రాలనంతగా జనం వచ్చారు. ఒక వైపు స్వాతంత్య్ర దినోత్సవం దేశభక్తి చాటుకుంటే, మరో వైపు పుష్కర వేడుకలు జిల్లాలో అట్టహాసంగా సాగుతూ కొత్తఒరవడిని సృష్టిస్తున్నాయి.

పుష్కర వేడుకల్లో జనం ఒక్కసారిగా పెరిగిపోయా రు. ఉదయం పది గంటల వరకు రోజూలాగే కనిపించిన ఘాట్లు ఆ తరువాత ఇసుక వేస్తే రాలనంతగా నిండుకుపోయాయి. ఈ క్రమంలో రంగాపూర్ ఘాట్ రద్దీని క్రమబద్ధీకరించేందుకు రెండుగంటల పాటు ఆ సమీపానే ఉన్న మునగమాన్‌దిన్నె ఘాట్‌కు వాహనాలను మళ్లించారు. బీచుపల్లి ఘాట్‌లోనూ జ నం లక్షలాదిగా తరలివచ్చారు. పుష్కరఘాట్, ఆల యం, పార్కింగ్, ఇతర మైదాన ప్రాంతమంతా భక్త జనంతో నిండుకొని పోవడంతో అధికారులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అయినప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు, తోపులాటలు లేకుండా ప్రజలకు పుష్కరస్నానం, దైవదర్శనం అందించడంలో అధికారులు సఫలీకృతులయ్యారు. మహిళలకు డ్రెస్సింగ్ మార్చుకునేందుకు అదనంగా షామీయానాలు ఏర్పాటు చేసి ఇబ్బందులు ఎదురవకుండా చూశారు. బీచుపల్లి, రంగాపూర్ ఘాట్లలోనే దాదాపు 6లక్షలకు పైగా భక్తులు పాల్గొన్నారంటే రద్దీ ఎలా ఉంటుందో ఇట్టే తెలిసిపోతుంది.

ఇబ్బందులు కలగనీయం
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జరుపుకుంటు న్న కృష్ణా పుష్కరాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బీచుపల్లి ఘాట్‌ను సందర్శించిన మంత్రి పుష్కరాలపై మాట్లాడారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ప్రశాంతంగా పుష్కరాలు సాగుతున్నాయన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న తమను సీఎం కేసీఆర్ పుష్కరఘాట్లలో భక్తుల పరిస్థితులను ఎప్పటికప్పుడు ప ర్యవేక్షణ చేయాలని సూచించారన్నారు. సీఎం సూ చన మేరకు హెలికాప్టర్ ద్వారా ఇతర ఘాట్ల పరిస్థితిని పరిశీలిస్తునట్లు అల్లోల తెలిపారు.

ఘాట్లను పర్యవేక్షించిన మంత్రులు
జిల్లాలోని పుష్కరఘాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, పంచాయతీరా జ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లకా్ష్మరెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డిలు పర్యవేక్షించారు. మంత్రు ల బృందం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా జిల్లాకు చేరుకొని బీచుపల్లి, సోమశిల తదితర ఘా ట్లను పరిశీలించారు. భక్తుల రద్దీ, నదిలో పారుతున్న నీటి పరిస్థితులు, సౌకర్యాలపై పర్యవేక్షణ చేశారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80%E0%B0%97%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B0%BF%E0%B0%97%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-20-597833.aspx