భారీ వాహనాల నిలిపివేత

పుష్కర స్నానానికి వెళ్లే భక్తులకు జాతీయ రహదారిపై రాకపోకలు చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు భారీ వాహనాల నిషేదం కేవలం ప్రకటనలే సరిపెట్టారంటూ ఆదివారం నమస్తే తెలంగాణ భారీ వాహనాలతో పుష్కర భక్తుల కు ఇబ్బందు లు అనే కథనంతో వెలుగులోకి తెచ్చిన విషయం విధితమే. అందుకు అధికారులు స్పందిం చారు. అదివారం ఉదయం పుష్క ర వాహనాల రద్దీ పెరుగుతుం డడంతో అడ్డాకుల మండలంలోని కొమిరెడ్డిపల్లి పార్కింగ్ జోన్ వద్ద భారీ వాహనాలను రవాణ శాఖ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ స్పెక్టర్ జీకే. కమల్‌కాంత్ అపుతూ ట్రాపిక్ తగ్గేవరకు అక్కడే ఉండా లని పార్కింగ్ రోడ్ల్ల ఆపారు. ఈ సందర్భంగా ఆయన నమస్తే తెలంగా ణతో మాట్లాడుతూ ముందుస్తుగా పాల్‌మాకుల వద్ద, షా ద్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్, అన్నాసాగర్ వద్ద కూడా అవకాశం ఉన్న సర్వీస్ రోడ్లు, పార్కింగ్ స్థలాలలో భారి వాహనాలన్ని అపేసినట్లు తెలిపారు. అనం తరం వాటిని మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి కర్నూల్ వైపు వెళ్లే వాహనాల రద్దీ తగ్గిన తర్వాత వదిలేశారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B0%E0%B1%80-%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B2%E0%B0%BF%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B5%E0%B1%87%E0%B0%A4-20-597639.aspx