ముగిసిన కృష్ణా పుష్కరాలు

krishna-sm తెలంగాణలో కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా కొనసాగాయి. అన్ని పుష్కరఘాట్ల వద్ద నదీ హారతితో పుష్కరాలు ముగిశాయి. నదీ హారతి కార్యక్రమం అన్ని పుష్కరఘాట్ల వద్ద రాత్రి 7 గంటలకు జరిగింది. పన్నెండు రోజుల పాటు పుష్కరఘాట్లన్నీ భక్తుల పుణ్యస్నానాలతో పులకరించిపోయాయి. నదీ తీరంలోని ఆలయాలన్నీ భక్త జనంతో కిటకిటలాడాయి. ఆగస్టు 12 నుంచి నేటి వరకు జరిగిన పుష్కరాల్లో 2 కోట్ల 50 లక్షల 98 వేల 831 మంది పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కోటి 80 లక్షల 11 వేల 801 మంది, నల్లగొండ జిల్లాలో 70 లక్షల 87 వేల 30 మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారు. 430

Source:http://www.namasthetelangaana.com/telangana-news/krishna-pushkaralu-in-telangana-1-1-502340.html