మొదటిరోజు 4.5 లక్షల మంది భక్తుల పుణ్యస్నానం

కృష్ణా పుష్కరాలు వైభవోపేతంగా కొనసాగుతోన్నాయి. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్‌లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. పుష్కరఘాట్‌ల వద్ద ఉన్న ఆలయాల్లో భక్తులు తమ మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ సాయంత్రం 6 గంటల వరకు 4.5 లక్షల మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు డీఐజీ అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 3.5 లక్షల మంది, నల్లగొండ జిల్లాలో లక్ష మంది పుణ్యస్నానం ఆచరించారని తెలిపారు. రేపటి నుంచి 3 రోజులు వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.