వెల్లువెత్తిన భక్త జనం..కృష్ణమ్మ పరవశం

-మార్మోగిన హరినామ స్మరణలు
-ద్వాదశ జ్యోతిర్లింగాలకు భక్తుల పూజలు
కొల్లాపూర్ /టౌన్ నమస్తే తెలంగాణ : కృష్ణా పుష్కరాలను తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం అక్షరాల కార్యరూపం దాల్చుతుంది. శనివారం రెండవ రోజు కొల్లాపూర్ మండలం సోమశిల పుష్కరఘాట్‌కు పోటెత్తిన భక్తజన ప్రవాహం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుం ది. కొల్లాపూర్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోమశిల, బీటీ డబుల్ రోడ్డు అనుక్షణం వాహనాల రాకపోకలతో కిక్కిరిసి పోయింది. జనరల్ ఘాట్ మొత్తం భక్తులతో ఉదయం నుంచి నిండిపోయింది. అయినప్పటికి అధికారులు ఘాట్లల్లో భక్తులను ఎక్కు వ సేపు ఉంచకుండా సూచనలు, సలహాలు చేస్తూ అప్రమత్తం చేశారు. దీంతో భక్తులు జనరల్ ఘాట్‌కు కొంత దూరంలో ఉన్న వీఐపీ పుష్కరఘాట్‌కు పుణ్య స్నానాలు చేయుటకు బారులు కట్టారు. మధ్యాహ్న సమయంలో భ క్తులు జనరల్ ఘాట్ పక్కనుం చే భక్తజనం పు ణ్య స్నానాలు చేస్తూ ఆ న ది తీరం అంతా జన ప్ర వాహంలా కన్పించింది.

నది వడ్డున మహిళలు కృ ష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మరి కొం దరు బ్రాహ్మణులతో పిండ ప్ర ధానాలు చేయించారు. గ్రామంలోని లలితా సో మేశ్వర స్వామి ఆలయం లో స్వామి వారిని దర్శించి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానదిలో పర్యాటకుల విహారం కోసం తెలంగాణ టూరిజం శాఖ ఏర్పాటు చేసిన సోమేశ్వర లాంచిలో భక్తులు డబ్బులు చెల్లించి నది అలలపై విహరించి ఆనందాన్ని వ్యక్తం పంచుకున్నారు. భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు చేస్తూ అధికారులు మైక్‌ల ద్వారా హెచ్చరికలు చేస్తూ ఘాట్లల్లో భక్తులు ఎక్కువ సేపు ఉండకుండా అప్రమత్తం చేశారు.

Source:
http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%B5%E0%B1%86%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5%E0%B1%86%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%AD%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%9C%E0%B0%A8%E0%B0%82-%E0%B0%95%E0%B1%83%E0%B0%B7%E0%B1%8D%E0%B0%A3%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%AA%E0%B0%B0%E0%B0%B5%E0%B0%B6%E0%B0%82-20-597382.aspx