వైభవంగా కృష్ణా పుష్కరాలు

కృష్ణా పుష్కరాలు నేటితో పదకొండో రోజుకు చేరుకున్నాయి. పవిత్ర స్నానలను ఆచరించేందుకు నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తుతున్నారు. పుష్కర స్నానాలకు ఈరోజు, రేపు మాత్రమే సమయం ఉండటంతో భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుంది. పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కానుకలు సమర్పించుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సోమశిళ పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారు. జాతీయ రహదారి నుంచి సోమశిలవైపు వాహనాలు భారీగా తరలివస్తున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు, పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు

Source:
http://www.namasthetelangaana.com/LatestNews-in-Telugu/krishna-ample-exposition-1-1-502143.html