సోమశిల ఘాట్‌కు వీఐపీల తాకిడి

కృష్ణా పుష్కరాల ముగింపునకు ఒక రోజు గడువు ఉండడంతో సోమవారం వివిధ రంగాలకు చెందిన అధికారులు, సాహితీవేత్త, రాజకీయ నాయకులు పుష్కర స్నానం చేసేందుకు సోమశిలలోని వీఐపీ పుష్కరఘాట్‌కు తరలివచ్చారు. తెలంగాణ సాహితీవేత్త కవి నాగర్‌కర్నూల్‌కు చెందిన కపిలవాయి లింగమూర్తి, ఐఎస్‌డబ్ల్యూ, హైదరాబాద్‌లోని మోహినాబాద్ డీఎస్పీ సుబ్రమణ్యం, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, అనంతపురం అడిషనల్ జడ్జి శేషుబాబు దంపతులు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జల్లాల విజిలెన్స్ ఎస్పీ దంపతులు పుష్కర స్నానం చేశారు. విజిలెన్స్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు వెంట వైద్య ఆరోగ్య శాఖ గజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు జూపల్లి రాజేందర్‌రావు, టీఆర్‌ఎస్ నియోజక వర్గ నాయకుడు నర్సింహారావులు ఉన్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B2-%E0%B0%98%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%95%E0%B1%81-%E0%B0%B5%E0%B1%80%E0%B0%90%E0%B0%AA%E0%B1%80%E0%B0%B2-%E0%B0%A4%E0%B0%BE%E0%B0%95%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF-20-599521.aspx