ఏడాదంతా పుష్కరమే.

-అంత్య పుష్కరాల తర్వాతే కృష్ణను వీడనున్న పుష్కరుడు
-12వ రోజూ ఘాట్లకు భారీ సంఖ్యలో భక్తుల హాజరు
-చివరి రోజు 9లక్షల మంది భక్తజనుల పుణ్య స్నానాలు
-వాడపల్లిలో అలరించిన హంస వాహనసేవ
కృష్ణా పుష్కర వేడుకలో పన్నెండు రోజుల ఆది పండుగ అత్యద్భుతంగా ముగిసింది. పుష్కర వేడుక మాత్రం ఏడాదిపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. బృహస్పతి కన్యారాశి ప్రవేశంతో కృష్ణవేణిలో ప్రవేశించిన పుష్కరుడు మాత్రం ఏడాదిపాటు నదిలో ఉండడమే ఇందుకు కారణం. వచ్చే జూలై చివర్లో అం పుష్కరాలు ముగిసే వరకు.. కృష్ణానదిలో భక్త జనం పుష్కర స్నానాలు ఆచరించవచ్చు. గ్రహబలం అధికంగా ఉండడమే కాకుండా.. పుణ్యఫలం ఎక్కువగా దక్కే అవకాశం ఉంటుందనే కారణంతోనే తొలి 12రోజులకు అధిక ప్రాధాన్యం ఉన్నా… జీవనది కృష్ణ ఏడాదిపాటు పుష్కరశోభతో అలరారుతూనే ఉంటుంది. ఆది పండుగ 12రోజుల్లోని చివరి రోజు కూడా 9లక్షల మంది భక్తులు జిల్లాలో పుష్కర స్నానం ఆచరించారు.

చివరి రోజూ అదే జోరు.. మొదటి రోజు వచ్చిన భక్తుల కంటే మూడింతల మంది అధనం కావడం మరింత విశేషం. 12 రోజుల్లో జిల్లా అం తటా 72 లక్షల మంది భక్తులు పుష్కరాలకు హాజరుకాగా.. చివరి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు అన్ని ఘాట్లలో కలిపి మొత్తం 8,68,718 మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. రాత్రి వరకు ఈ సంఖ్య 10,34,133 చేరుకుంది. మొత్తం 28 ఘాట్లలో చివరి రోజు ఉద యం నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ముఖ్యంగా ఆఖరిరోజు కూడా నాగార్జున సాగర్ శివాలయం ఘాట్‌లోనే అత్యధిక మంది భక్తులు పిండ ప్రదానాలు నిర్వహించి పుష్కర స్నానాలు చేశారు. సాగర్‌లోని మొత్తం మూడు ఘాట్లలో సుమారు 3 లక్షల మంది భక్తులు హాజరయ్యారు.

ఒక్క శివాలయం ఘాట్‌లోనే 2 లక్షల కంటే ఎక్కువ మంది భక్తులు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. వాడపల్లిలోనూ చివరిరోజు భక్త జనులు బారులు కొనసాగాయి. ఇక్కడకూడా ప్రదానంగా శివాలయం ఘాట్‌లోనే ఎక్కువ మంది భక్తులు పుష్కరస్నానాలు ఆచరించారు. 12వ రోజు వాడపల్లితో పాటు దామరచర్ల మండలంలోని 8 ఘాట్లలో కలిపి మొత్తం సుమారు 2 లక్షల మంది భక్తులు పుష్కర వేడుకల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత మట్టపల్లితోపాటు దర్వేశిపురంలోనూ లక్ష మంది కంటే ఎక్కువ భక్తులు పుష్కరాలకు హాజరయ్యారు.

చివరి రోజు పుష్కరాలకు ప్రముఖుల క్యూ..
కృష్ణా పుష్కరాల చివరిరోజు నాడు వివిధ ఘాట్లలో పలువురు ప్రముఖులు పుష్కర స్నానాలు చేశారు. అంతకు ముందు పిండ ప్రదానాలు కూడా నిర్వహించారు. నాగార్జున సాగర్‌లోని శివాలయం వీఐపీ ఘాట్‌లో సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ వేర్వేరుగా పుష్కర స్నానాలు చేసి.. కృష్ణవేణికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మట్టపల్లి పుష్కరఘాట్‌లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హిమాలయాల నుంచి సాధువులు గణేష్ మహరాజ్ సహా పలువురు పుణ్య స్నానాలు ఆచరించారు. వీరితోపాటు ఇంకా పలువురు జిల్లాలోని పలు మారుమూల ఘాట్లలోనూ పుష్కర స్నానాలు చేయడం విశేషం. చివరిరోజు రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి వాడపల్లి, నాగార్జున సాగర్‌లో పుష్కరఘాట్లను పరిశీలించారు. పోలీసుల కృషిని అభినందించారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
12 రోజుల పుష్కర వేడుక ముగింపు సందర్భంగా వాడపల్లిలో జిల్లా అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం శివకల్యాణంతోపాటు సాయంత్రం ఉత్సవ విగ్రహాలను నదిలో హంసవాహనం ద్వారా ఊరేగించారు. వాడపల్లిలో మొత్తం 8 పుష్కరఘాట్లలోనూ హంసవాహనానికి ప్రత్యేక హారతులు ఇచ్చారు. కన్నుల పండువగా సాగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్పీ ప్రకాష్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమెల్యే భాస్కర్‌రావుతోపాటు ఏజేసీ వెంకట్రావ్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా సాగర్, మట్టపల్లి, మహంకాళిగూడెం, పానగల్, దర్వేశీపురం ఘాట్ల వద్ద చివరిరోజు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. 12 రోజుల పండుగ ముగిసినా పుష్కరుడు ఏడాదిపాటు కృష్ణా నదిలోనే ఉండనున్నందున.. జిల్లాలోని కృష్ణాతీరానికి ఏడాది పొడవునా భక్తుల తాకిడి కొనసాగే అవకాశం ఉంది. వచ్చే ఏడాది కృష్ణా అంత్య పుష్కరాలు పూర్తయిన తర్వాత కావేరీ నదిలో పుష్కరుడి ప్రవేశం జరుగుతుంది.

Source:http://www.namasthetelangaana.com/Districts/Nalgonda/%E0%B0%8F%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A6%E0%B0%82%E0%B0%A4%E0%B0%BE-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%AE%E0%B1%87-22-599854.aspx

పదకొండో రోజు సుమారు 31 లక్షల మంది భక్తుల పుణ్యస్నానం……

రాష్ట్రంలోని మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాల్లో కృష్ణమ్మ పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం రెండు జిల్లాల్లోని పుష్కరఘాట్లుభక్తజనంతో కిటకిటలాడాయీ. నల్గొండ జిల్లాలో 10లక్షల మంది,మహబూబ్ నగర్ జిల్లాలో 21లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా.

Source:
Namasthe Telangana

పదకొండో రోజు ఘనంగా కొనసాగుతోన్న కృష్ణా పుష్కరాలు

కృష్ణమ్మ ఒడిలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. కృష్ణా నదీ తీరం పుష్కర కళను సంతరించుకుంది. ఇవాళ పదకొండో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కృష్ణా నది తీరంలో పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేస్తూ తరిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రవాణా, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.

పదో రోజు సుమారు 50 లక్షల మంది భక్తుల పుణ్యస్నానం……

రాష్ట్రంలోని మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాల్లో కృష్ణమ్మ పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రెండు జిల్లాల్లోని పుష్కరఘాట్లుభక్తజనంతో కిటకిటలాడాయీ. నల్గొండ జిల్లాలో 15లక్షల మంది,మహబూబ్ నగర్ జిల్లాలో 35లక్షల మందిపుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా.

తొమ్మిదో రోజు సుమారు 28.16 లక్షల మంది భక్తుల పుణ్యస్నానం…….

రాష్ట్రంలోని మహబూబ్ నగర్,నల్గొండ జిల్లాల్లో కృష్ణమ్మ పుష్కరాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివారం రెండు జిల్లాల్లోని  పుష్కరఘాట్లుభక్తజనంతో కిటకిటలాడావయీ. నల్గొండ జిల్లాలో 6లక్షల మంది,మహబూబ్ నగర్ జిల్లాలో 22.16లక్షల మందిపుణ్యస్నానాలు ఆచరించినట్లు అంచనా.

ఎనిమిదో రోజు సుమారు 20 లక్షల మంది భక్తుల పుణ్యస్నానం…….

పుష్కరాల్లో ఎనిమిదో రోజైన శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లాలో 14 లక్షలు, నల్లగొండ జిల్లాలో ఆరు లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కరాలు పూర్తయ్యేందుకు మరో నాలుగు రోజులే గడువు ఉండటంతో శనివారం నుంచి వరుసగా నాలుగురోజులపాటు భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నది. మహబూబ్‌నగర్ జిల్లాలోని రంగాపూర్, బీచుపల్లి, సోమశిల, జోగుళాంబ, నదీఅగ్రహారం, పస్పుల, కృష్ణా(మాగనూరు), నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి ఘాట్లు జనంతో కిటకిటలాడుతున్నాయి.

Source:
http://pushkaralu.telangana.gov.in/%E0%B0%AA%E0%B1%81%E0%B0%A3%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AA%E0%B1%81%E0%B0%A8%E0%B1%80%E0%B0%A4%E0%B0%82/

తొమ్మిదో రోజు ఘనంగా కొనసాగుతున్న కృష్ణా పుష్కరాలు

krishna-somshila
తెలంగాణలో తొమ్మిదో రోజు కృష్ణా పుష్కరాలు వైభవంగా కొనసాగుతోన్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తులు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. ఇవాళ శ్రావణ శనివారం కావడంతో క్రమేపీ భక్తుల రద్దీ పెరుగుతోంది. పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. కానుకలు సమర్పించుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని సోమశిల పుష్కరఘాట్‌కు భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు, పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Source:
http://www.namasthetelangaana.com/telangana-news/krishna-pushkaralu-in-telangana-1-1-501970.html

ఎనిమిదో రోజు ఘనంగా కొనసాగుతోన్న కృష్ణా పుష్కరాలు

Pushkaralu2కృష్ణమ్మ ఒడిలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తూ పునీతులవుతున్నారు. కృష్ణా నదీ తీరం పుష్కర కళను సంతరించుకుంది. ఇవాళ ఎనిమిదో రోజు కృష్ణా పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని కృష్ణా నది తీరంలో పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేలాదిగా భక్తులు నదిలో పుణ్య స్నానాలు చేస్తూ తరిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. రవాణా, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించింది.

పుష్కరాలలో కొనసాగుతున్న వైఫై సేవలు

జిల్లాలో ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన పుష్కరాల సందర్భంగా పస్పుల, అలంపూర్, నందిమళ్ల, బీచుపల్లి, పాతాళగంగ తదితర పుష్కర ఘాట్లలో ప్రతి రోజు అరగంట వైఫై సేవలు ఉచితంగా అందజేస్తున్నామని బీఎస్‌ఎన్‌ఎల్ జీఎం పద్మనాభం పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచించిన 300 మంది అధికారులకు 24 గంటలు వైఫై సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే గొందిమళ్ల, రంగాపూర్, నదీఅగ్రహారం, పెద్దచింతరేవుల తదితర ప్రాంతాల్లో బీటీఎస్ సేవలతోపాటు 3జీ సేవలు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అలాగే బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి మార్కెటింగ్ విభాగం నుంచి 48మంది టెలిఫో న్ మెకానిక్‌లు, అధికారులు, సిబ్బంది, తదితరులు విధులు నిర్వహిస్తున్నారన్నారు. నూతనంగా వినియోగదారుల కోసం మార్కెట్‌లోకి 49, 470 కాంబ్లో ప్లాన్‌లు అమలులోకి వచ్చిందన్నారు. 49 ప్లాన్ 90 రోజుల ఆఫర్ ఉందని, దీని వ్యాలిడిటీ 6 నెలలు మాత్రమేనని తెలిపారు. అలాగే ల్యాండ్‌లైన్లు ఫోన్లు తీసుకున్న ఎలాంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు తీసుకోమని వారు చెప్పారు. సమావేశంలో డీజీఎంలు అబేద్‌అలీ, వేణుగోపాల్, ఎస్‌డీఈ హేమలత, జేటీవోలు సక్రూనాయక్, శశి తదితరులు పాల్గొన్నారు.

Source:http://www.namasthetelangaana.com/Districts/Mahboobnagar/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%95%E0%B1%8A%E0%B0%A8%E0%B0%B8%E0%B0%BE%E0%B0%97%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B5%E0%B1%88%E0%B0%AB%E0%B1%88-%E0%B0%B8%E0%B1%87%E0%B0%B5%E0%B0%B2%E0%B1%81-20-598055.aspx

19న మఠంపల్లిలో గవర్నర్ పుష్కరస్నానం

ఈ నెల 19న నల్లగొండ జిల్లా మఠంపల్లి పుష్కరఘాట్‌లో గవర్నర్ నరసింహన్ పుష్కరస్నానం చేయనున్నారు. మఠంపల్లిలో పుష్కరస్నానం ముగిసిన అనంతరం గవర్నర్ యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. యాదాద్రిలో లక్ష్మీనర్సింహస్వామికి నరసింహన్ ప్రత్యేక పూజలు చేయనున్నారు. తెలంగాణలో కృష్ణా పుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతోన్న విషయం విదితమే.

Source:
http://www.namasthetelangaana.com/telangana-news/governor-narasimhan-will-go-to-mathampally-for-krishna-pushkaralu-1-1-501447.html